ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు పోరు తప్పదని పలు పార్టీల నేతలు స్పష్టం చేశారు. ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నంలో భాగంగానే ఈ పరిస్థితి తలెత్తిందని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుడు శ్రీనివాసరెడ్డి మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షడు కోదండరాం అన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఆయన సంఘీభావం తెలిపారు.
ఎవరి సొత్తని ఆస్తులు కట్టబెడతారు
హైదరాబాద్‌లో పీఆర్టీయూ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశానికి రేవంత్‌రెడ్డి, ఆర్.కృష్ణయ్య హాజరయ్యారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్టబద్ధంగానే జరుగుతోందని రేవంత్‌రెడ్డి అన్నారు. కార్మికుల సమ్మెకు అన్ని సంఘాలు మద్దతు ప్రకటించాలని కోరారు. ఆర్టీసీ ఆస్తులను ఇతరులను కట్టబెడితే ఊరుకునేది లేదని ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. సమ్మెపై ప్రజలను తప్పుదారి పట్టించేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు.