తెలంగాణ

telangana

ETV Bharat / city

దసరాకు టీఎస్​ఆర్టీసీ మూడు వేల ప్రత్యేక సర్వీసులు

దసరా సందర్బంగా టీఎస్​ఆర్టీసీ మూడు వేల ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఈ నెల 15 ప్రారంభమైన ఈ సేవలు... 24వ తేదీ వరకు కొనసాగనున్నాయి. జంట నగరాల్లోని ముఖ్యమైన అన్ని బస్​స్టేషన్ల నుంచి అందుబాటులో ఉంచారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా... అదనపు బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కూడా కల్పించారు.

tsrtc runs specil services for dasara festival in tealangan
దసరాకు టీఎస్​ఆర్టీసీ మూడు వేల ప్రత్యేక సర్వీసులు

By

Published : Oct 19, 2020, 7:58 PM IST

తెలంగాణలో ముఖ్యమైన దసరా పండగ సందర్బంగా టీఎస్​ఆర్టీసీ మూడు వేల ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నట్టు రంగారెడ్డి ఆర్ఎం వరప్రసాద్​ తెలిపారు. జంట నగరాల నుంచి రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు ఈ సేవలు అందించనున్నట్టు వెల్లడించారు. అందులో భాగంగా 15 నుచి 18 వరకు ఎంజీబీఎస్, జేబీఎస్ నుంచి వివిధ ప్రాంతాలకు అదనంగా 281 బస్సులు, 22 నుంచి 24 వరకు 2,034 బస్సులు నడపనున్నట్టు వివరించారు.

ఈ నెల 22న 657, 23న 659, 24న 614 అదనపు సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఎంజీబీఎస్, జేబీఎస్​ వంటి ప్రధాన బస్​స్టేషన్ల నుంచి దిల్​సుఖ్​నగర్, కేపీహెచ్​బీ, ఎస్​ఆర్​ నగర్, అమీర్​పేట్, టెలిఫోన్ భవన్, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్, ఎల్​బీ నగర్​కు ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నామన్నారు.

నగర శివార్లలో నివసించే వారికోసం ముఖ్యమైన పాయింట్ల నుంచి, ఆధీకృత టికెట్ బుకింగ్ ఏజెంట్ల నుంచి ప్రత్యేక బస్సులు నడపడానికి ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. 22 నుంచి 24 వరకు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అదనపు అడ్వాన్స్ రిజర్వేషన్ www.tsrtconline.inసౌకర్యం కల్పించినట్టు తెలిపారు. జేబీఎస్​ నుంచి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాబాద్, మెదక్ జిల్లాలకు, ఉప్పల్ క్రాస్ రోడ్డు నుంచి యాదగిరిగుట్ట, జనగాం, పరకాల, నర్సంపేట, మహబూబాబాద్​, తొర్రూర్, వరంగల్ వైపు వెళ్లు బస్సులు నడపనున్నట్టు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details