తెలంగాణ

telangana

ETV Bharat / city

కార్మిక సంఘాల నేతలకు షాకిచ్చిన ఆర్టీసీ యాజమాన్యం - tsrtc strike effect

కార్మిక సంఘాలకు ఆర్టీసీ యాజమాన్యం షాకిచ్చింది. సంస్థలో కార్మిక సంఘాలకు చోటు లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన మరుసటి రోజే.. యాజమాన్యం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కార్మిక సంఘాల నేతలకు ఇస్తున్న ప్రత్యేక సౌకర్యాలు రద్దు చేసింది.

tsrtc news
tsrtc news

By

Published : Nov 29, 2019, 2:11 PM IST

కార్మికసంఘాల నేతలకు... విధుల నుంచి మిహాయింపును ఆర్టీసీ యాజమాన్యం రద్దు చేసింది. ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రస్థాయిలో టీఎంయూకు చెందిన 26 మంది, ఎంప్లాయిస్ యూనియన్‌కు చెందిన ముగ్గురు, ఎస్​డబ్ల్యుఎఫ్​కు చెందిన ఒక్కరికి ఇప్పటివరకు మినహాయింపు ఉండేది. కార్మికుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం కోసం పనిచేసేందుకు వీలుగా కార్మిక సంఘాల నేతలకు విధుల నుంచి మినహాయింపు ఇచ్చేవారు. తద్వారా వారు విధులకు హాజరుకాకపోయినా... యాజమాన్యం జీతం చెల్లిస్తోంది. జిల్లా, డిపో స్థాయిల్లోనూ కార్మికసంఘం నేతలకు మినహాయింపు ఉండేది.

తాజా పరిణామాల దృష్ట్యా కార్మికసంఘాల నేతలెవరికీ విధుల నుంచి మినహాయింపు ఉండబోదని యాజమాన్యం స్పష్టం చేసింది. తాజా నిర్ణయంతో హైదరాబాద్ బస్‌భవన్‌లోని గుర్తింపు సంఘం తెలంగాణ మజ్దూర్ యూనియన్ కార్యాలయానికి అధికారులు తాళాలు వేశారు. విజిలెన్స్ డైరెక్టర్ రామచందర్ రావు , చీఫ్ పర్సనల్ మేనేజర్ కిరణ్ ఆదేశాల మేరకు టీఎంయూ కార్యాలయానికి తాళాలు వేసినట్లు బస్ భవన్ భద్రతా సిబ్బంది వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details