తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆర్టీసీ మరో బంపర్​ ఆఫర్​.. ఈసారి పదో తరగతి విద్యార్థులకు ఫ్రీ.. - RTC another bumper offer

TSRTC Offer to Tenth Class Students: టీఎస్​ ఆర్టీసీ మరో అదిరిపోయే ఆఫర్​ ప్రకటించింది. పండుగలకు, ప్రత్యేక రోజులకు స్పెషల్​ ఆఫర్లు​ ప్రకటించే ఆర్టీసీ.. ఈసారి విద్యార్థుల కోసం ఆలోచించింది. రేపటి నుంచి పరీక్షలు రాయనున్న విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్టు వెల్లడించింది.

TSRTC Offers Free Bus rids for tenth class students in examinations time
TSRTC Offers Free Bus rids for tenth class students in examinations time

By

Published : May 22, 2022, 9:17 PM IST

TSRTC Offer to Tenth Class Students: పండుగలకు, ప్రత్యేక రోజుల నేపథ్యంలో అద్భుతమైన ఆఫర్లతో ప్రయాణికులను ఆకర్షించే ఆర్టీసీ మరో బంపర్​ ఆఫర్​ను తీసుకొచ్చింది. సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఆయా రోజుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ఆర్టీసీ యాజమాన్యం.. ఈసారి విద్యార్థుల కోసం అదిరిపోయే ఆఫర్​ ఇస్తోంది. రేపటి నుంచి పరీక్షలు రాసే పదో తరగతి విద్యార్థులకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించింది. రేపటి నుంచి ప్రారంభమవుతున్న పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం కల్పించాలని యాజమాన్యం నిర్ణయించింది.

పరీక్షలు ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు ఈ సౌకర్యం అందుబాటులో ఉండనున్నట్టు ఆర్టీసీ వెల్లడించింది. ఈ సౌకర్యంతో.. విద్యార్థులను వారి పరీక్షా కేంద్రాల వద్దకు ఆర్టీసీ బస్సులు తీసుకెళ్లనున్నాయి. మళ్లీ పరీక్ష ముగిసిన తర్వాత కూడా బస్సులు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ గ్రేటర్ ఈడీ యాదగిరి తెలిపారు. ఉచితంగా ప్రయాణించాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా.. తమ హాల్ టికెట్లను కండక్టర్లకు చూపించాలని పేర్కొన్నారు. విద్యార్థులు రవాణాపరంగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆర్టీసీ తరఫున ఈ సౌలభ్యం కలిగిస్తున్నట్టు యాదగిరి తెలిపారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details