TSRTC MD Sajjanar: 'ప్రయాణికులతోనే ఆర్టీసీకి ఆదాయం' - TSRTC MD Sajjanar about RTC
TSRTC MD Sajjanar: నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించేందుకు తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ప్రమాదాల నివారణకు శాస్త్రీయ పద్ధతులను అమలు చేస్తామని వెల్లడించారు. కొత్త బస్సుల కొనుగోలుపై ఇటీవల బ్యాంకులతో సంప్రదింపులు చేశామని చెప్పారు. ఆర్టీసీ ఎండీగా ఆరు నెలల్లో చేపట్టిన చర్యలపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌తో ముఖాముఖి

TSRTC MD Sajjanar : ప్రయాణికులతోనే సంస్థకు ఆదాయమని ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తున్నామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఆదాయం పెంచుకుంటూ నష్టాలను తగ్గించుకునేలా ప్రణాళికలు చేస్తున్నామని వివరించారు. ఎండీగా సజ్జనార్ బాధ్యతలు తీసుకున్న తర్వాత సంస్థలో ఎటువంటి మార్పులు చోటుచేసుకున్నాయి...? ప్రయాణికులకు తెలియకుండా ఛార్జీలను ఎందుకు గోప్యంగా పెంచాల్సి వస్తోంది...? ఇప్పటి వరకు పెంచినవి కొసరు ఛార్జీలేనా....ఇంకా పెంచాల్సి ఉందా..? కాలం చెల్లిన బస్సులను ఇంకా ఎంతకాలం నడిపిస్తారు..? వీఆర్‌ఎస్ పేరిట కార్మికులను తొలగించేందుకు ఆర్టీసీ కసరత్తులు చేస్తోందా...?తదితర అంశాలపై ఎండీ సజ్జనార్‌తో ముఖాముఖి.
- ఇదీ చదవండి :రెండేళ్లుగా కారులోనే నివాసం.. ఇంతకీ ఎవరామె?