తెలంగాణ

telangana

ETV Bharat / city

'ఆర్టీసీ అధికారుల వైఖరి వల్లే సమ్మె చేస్తున్నాం' - tsrtc strike news

ప్రభుత్వం సకాలంలో స్పందించకపోవడం వల్లే విధిలేని పరిస్థితిలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగినట్లు యూనియన్​ నేత బీవీ రెడ్డి తెలిపారు. గాంధీ భవన్​లో టీపీసీసీ నేతలను కలిసిన యూనియన్​ నాయకులు తాజా పరిస్థితులను వివరించారు.

'ఆర్టీసీ అధికారుల వైఖరి వల్లే సమ్మె చేస్తున్నాం'

By

Published : Nov 17, 2019, 9:04 PM IST

రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో స్పందించకపోవడం వల్లే విధిలేని పరిస్థితుల్లో సమ్మెకు వెళ్లినట్లు ఆర్టీసీ యూనియన్‌ నేత బీవీ రెడ్డి స్పష్టం చేశారు. సమ్మె నోటీసు ఇచ్చిన తరువాత... చర్చలకు పిలిచి డిమాండ్లపై చర్చించకుండానే సమ్మెను విరమించాలని కోరినట్లు ఆయన చెప్పారు. బీవీ రెడ్డితో సహా మరికొందరు ఆర్టీసీ కార్మిక నాయకులు గాంధీభవన్‌ వచ్చి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డితో పాటు పార్టీ సీనియర్‌ నేతలను కలిసి తాజా పరిస్థితులను వివరించారు. తాము సమ్మెకు వెళ్లడానికి ఆర్టీసీ అధికారుల వైఖరే కారణమని బీవీ రెడ్డి అన్నారు. ఆర్టీసీనే లేకుండా చేయాలని ముఖ్యమంత్రి చూస్తున్నారంటూ ఆరోపించారు.

'ఆర్టీసీ అధికారుల వైఖరి వల్లే సమ్మె చేస్తున్నాం'

ABOUT THE AUTHOR

...view details