తెలంగాణ

telangana

ETV Bharat / city

సీఎం డెడ్​లైన్​... భవిష్యత్​ కార్యాచరణపై ఐకాస చర్చలు

విధుల్లో చేరేందుకు ప్రభుత్వం గడువు ఇచ్చిన నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై విపక్షనేతలు, ప్రజాసంఘాలతో ఆర్టీసీ ఐకాస సమావేశమైంది. ఆర్టీసీ కార్మికుల్లో ఆత్మస్థైర్యం నింపడంతో పాటు, భరోసా కల్పించాలని నిర్ణయించింది.

tsrtc jac

By

Published : Nov 5, 2019, 1:44 PM IST

Updated : Nov 5, 2019, 1:52 PM IST

ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అవకాశం కల్పించిన గడువు ఈరోజుతో ముగిసిపోతుంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికుల్లో ఆత్మస్థైర్యం నింపడంతో పాటు, కార్మికుల ఉద్యోగాలు ఎక్కడికి పోవనే భరోసాను కల్పించాలని ఆర్టీసీ ఐకాస నిర్ణయించింది. విపక్షనేతలు, ప్రజాసంఘాలతో విద్యానగర్​లోని ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో ఆర్టీసీ ఐకాస సమావేశమైంది.

చర్చిస్తున్న అంశాలు:

  1. ఆర్టీసీ సమ్మెపై కార్మికుల్లో ఎలాంటి చర్చ జరుగుతుంది
  2. అభద్రతాభావంతో ఉన్నవారికి ధైర్యాన్ని నింపడం
  3. కార్మికుల్లో భిన్నాభిప్రాయాలు ఉంటే వాటిని నివృత్తి చేయడం
  4. కార్మికులతో మేమంతా ఉన్నామని భరోసా కల్పించడం
  5. ఈనెల 7 న కోర్టు​లో చర్చకు వచ్చే అంశాలు
  6. భవిష్యత్ కార్యాచరణపై విపక్షాలు, ప్రజాసంఘాలు, ట్రేడ్ యూనియన్లను భాగస్వామ్యం చేసే అంశం

ఆర్టీసీ అధికారులపై జరిగిన దాడులకు కార్మికులకు ఎటువంటి సంబంధం లేదని ఆర్టీ​సీ ఐకాస పేర్కొంది. అధికారులపై దాడులను ఖండించింది.

సీఎం డెడ్​లైన్​... భవిష్యత్​ కార్యాచరణపై ఐకాస చర్చలు
Last Updated : Nov 5, 2019, 1:52 PM IST

ABOUT THE AUTHOR

...view details