తెలంగాణ

telangana

ETV Bharat / city

గన్​పార్క్​ వద్ద ఆర్టీసీ , అఖిలపక్ష నేతల మౌనదీక్ష - tsrtc strike at hyderabad

రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి అనుకూల నిర్ణయం తీసుకోవాలని ఆర్టీసీ ఐకాస నేతలు మౌన దీక్ష చేపట్టారు. గన్​పార్క్​ వద్ద సుమారు గంట పాటు చేపట్టిన దీక్షలో అఖిలపక్ష నేతలు పాల్గొన్నారు.

గన్​పార్క్​లో ఆర్టీసీ, అఖిలపక్ష ఐకాస నేతల మౌనదీక్ష

By

Published : Nov 2, 2019, 7:18 PM IST

ప్రగతిభవన్​లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ , అఖిలపక్ష నేతలు గన్​పార్క్ వద్ద మౌన దీక్ష చేపట్టారు. మంత్రివర్గ సమావేశంలో సీఎం కేసీఆర్ మనసు మారి ఆర్టీసీ కార్మికుల పట్ల అనుకూల నిర్ణయం తీసుకోవాలని ఆర్టీసీ జేఏసీ నేతలు కోరుకున్నట్లు ... మౌన దీక్ష అనంతరం అశ్వత్థామ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ ఐకాస, అఖిలపక్ష నేతలు సుమారు గంటపాటు మౌన దీక్ష చేపట్టారు. ఇప్పటికైనా సీఎం ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని అశ్వత్థామ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

గన్​పార్క్​లో ఆర్టీసీ, అఖిలపక్ష ఐకాస నేతల మౌనదీక్ష

ABOUT THE AUTHOR

...view details