తెలంగాణ

telangana

ETV Bharat / city

'కేకే మధ్యవర్తిత్వం వహిస్తే చర్చలకు సిద్ధం'

తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు మధ్యవర్తిత్వం వహిస్తే చర్చలకు సిద్ధమని ఆర్టీసీ ఐకాస కన్వీనర్​ అశ్వత్థామ రెడ్డి తెలిపారు. రాజ్​భవన్​లో గవర్నర్​ను కలిసి సమ్మెపై ప్రభుత్వ తీరుని వివరించామని ఆయన వెల్లడించారు.

'కేకే మధ్యవర్తిత్వం వహిస్తే చర్చలకు సిద్ధం'

By

Published : Oct 14, 2019, 2:04 PM IST

Updated : Oct 14, 2019, 3:17 PM IST

ప్రభుత్వంతో చర్చలకు తెలంగాణ ఆర్టీసీ ఐకాస సిద్ధం

ఆర్టీసీ ఐకాస నేతలు రాజ్​భవన్​లో గవర్నర్​ తమిళిసైని కలిశారు. ఆర్టీసీ సమ్మె తీరుపై ప్రభుత్వం వైఖరి, తదనంతర పరిణామాలను గవర్నర్​కు వివరించారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆర్టీసీ ఐకాస కన్వీనర్​ అశ్వత్థామరెడ్డి అన్నారు. కె.కేశవరావు మధ్యవర్తిత్వం వహిస్తే చర్చలకు సిద్ధమని ఆయన ప్రకటించారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గుర్తిస్తామని గతంలో కేసీఆర్​ చెప్పారని గుర్తు చేశారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసమే పోరాడుతున్నామని అశ్వత్థామ రెడ్డి వెల్లడించారు.

Last Updated : Oct 14, 2019, 3:17 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details