ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే వరకు సమ్మెను కొనసాగిస్తామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి పునరుద్ఘాటించారు. ప్రతి రోజు మంచి ప్రణాళికతో శాంతియుతంగా సమ్మె చేస్తామన్నారు. సమ్మె చేస్తున్న కార్మికులపై చర్యలు తీసుకోవడానికి ఎవరి దయాదాక్షిణ్యాలతో వచ్చిన ఉద్యోగాలు కావన్నారు. విధులకు హాజరు కానీ కార్మికులను తొలగించాలంటే... మొదట తననే ఉద్యోగం నుంచి తొలగించాలన్నారు. రేపు ప్రతి బస్సు డిపో ముందు బతుకమ్మలతో నిరసనలు చేస్తామని పేర్కొన్నారు. ఎల్లుండి ఇందిరా పార్కు వద్ద 16మందితో నిరాహార దీక్షలు చేపడుతామని చెప్పారు. హయత్‌నగర్‌లో ఆర్టీసీ కార్మికులను కలిసి అశ్వత్థామ రెడ్డి సంఘీభావం తెలిపారు.
రేపు బస్సు డిపోల ఎదుట బతుకమ్మలతో నిరసన - రేపు బస్సుడిపోల ఎదుట బతుకమ్మలతో నిరసన: అశ్వత్థామ రెడ్డి
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేవరకు సమ్మె కొనసాగిస్తామని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి చెప్పారు. రేపు ప్రతి బస్సు డిపోల ఎదుట బతుకమ్మలతో నిరసనలు చేస్తామన్నారు. ఎల్లుండి ఇందిరాపార్కు వద్ద నిరాహారదీక్ష చేస్తామని అశ్వత్థామరెడ్డి ప్రకటించారు.
రేపు బస్సుడిపోల ఎదుట బతుకమ్మలతో నిరసన: అశ్వత్థామ రెడ్డి