కార్మిక నేతలకు విధుల మినహాయింపులు రద్దు చేయడం చిల్లర చర్య అని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. చట్ట ప్రకారమే కార్మిక నేతలకు కొన్ని మినహాయింపులుంటాయని తెలిపారు. డ్యూటీ రిలీఫ్‌ల రద్దుపై కార్మిక శాఖ కమిషనర్ స్పందించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే యూనియన్ నేతలు విధుల్లోకి వెళ్తారని పేర్కొన్నారు.
సంఘాలు ఉండాలా లేదా అనేది వాళ్లు తేలుస్తారు: అశ్వత్థామరెడ్డి - తెలంగాణ ఆర్టీసీ సమ్మె
కార్మిక సంఘాలు ఉండాలా లేదా అన్నది లేబర్ కోర్టు తేలుస్తుందని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. తమ సమస్యలపై కార్మిక కోర్టులో న్యాయం జరుగుతుందని ఆకాంక్షించారు.
ashwathama reddy
ఆర్టీసీని అధికారులు ఇష్టం వచ్చినట్లు దోచుకున్నారని ఆరోపించారు. కార్మికుల జీతాలతోపాటు ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మిక సంఘాలు ఉండాలా లేదా అన్నది లేబర్ కోర్టు తేలుస్తుంది స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: కార్మిక సంఘాల నేతలకు షాకిచ్చిన ఆర్టీసీ యాజమాన్యం
Last Updated : Nov 29, 2019, 4:11 PM IST