కోర్టు చివాట్లు పెట్టినా ప్రభుత్వం, యాజమాన్యం వైఖరి మారలేదు ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. ఆర్టీసీ గురించి ఎండీ సునీల్‌శర్మకు ఏం తెలుసని ప్రశ్నించారు. సునీల్ శర్మ బాధ్యతలు చేపట్టి 17 నెలలే అయిందని పేర్కొన్నారు. ఆర్టీసీ ఎండీ ఇచ్చిన అఫిడవిట్ రాజకీయ నాయకులు ఇచ్చినట్లుగా ఉందని విమర్శించారు. సునీల్‌శర్మ ఎండీగా ఉన్న 17 నెలల్లో 7 సార్లు కూడా కార్యాలయానికి రాలేదని తెలిపారు.
ఆర్టీసీ గురించి ఎండీ సునీల్‌శర్మకు ఏం తెలుసు: అశ్వత్థామరెడ్డి
సమ్మె వల్ల సంస్థ నష్టపోలేదని.. ప్రభుత్వ విధానాల వల్లే నష్టపోయిందని అశ్వత్థామరెడ్డి తెలిపారు. ఆర్టీసీ గురించి ఎండీ సునీల్‌శర్మకు ఏం తెలుసని ప్రశ్నించారు. సమ్మె చట్టబద్ధమా? కాదా? అనేది కోర్టు తేలుస్తుందని ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.
ashwathamareddy
సమ్మె వల్ల సంస్థ నష్టపోలేదని.. ప్రభుత్వ విధానాల వల్లే నష్టపోయిందని అన్నారు. సమ్మె చట్ట బద్ధమా? కాదా? అనేది కోర్టు తేలుస్తుందని చెప్పారు. సీఎం తయారు చేసిన అఫిడవిట్‌పై ఎండీ సునీల్‌శర్మ సంతకం చేస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చూడండి: సమ్మెపై హైకోర్టులో ఆర్టీసీ అదనపు కౌంటర్
Last Updated : Nov 16, 2019, 10:11 PM IST