ఎలాంటి షరతుల్లేకుండా విధుల్లోకి ఆహ్వానిస్తే ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించడానికి సిద్ధంగా ఉన్నారని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. ఆ దిశగా ప్రభుత్వం, యాజమాన్యం ఆలోచన చేస్తుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. విధుల్లోకి వచ్చే వారికి ఎలాంటి షరతులు విధించకూడదని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హైకోర్టు తీర్పుపై సుదీర్ఘ సమీక్ష జరిపామని తెలిపారు. లేబర్ కోర్టులో న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పటి వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
'బేషరతుగా ఆహ్వానిస్తే విధులకు హాజరయ్యేందుకు సిద్ధం'
కార్మిక న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. సమ్మె చేసేది పరిస్థితిని చక్కదిద్దేందుకు మాత్రమేనని స్పష్టం చేశారు. బేషరతుగా ఆహ్వానిస్తే విధులకు హాజరయ్యేందుకు సిద్ధమేనని ప్రకటించారు. ఆంక్షలు లేకుండా చర్చలకు ఆహ్వానిస్తే సమ్మె విరమిస్తామన్నారు.
tsrc jac leader