రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలులో ఉన్నందున ప్రజల కనీస అవసరాల కోసం తమవంతుగా ఆర్టీసీ కార్మికులు వారి ఒకరోజు వేతనాన్ని సీఎం సహాయ నిధికి ఇవ్వాని నిర్ణయించారు. ఏప్రిల్ 1న చెల్లించే మార్చి నెల జీతంలో ప్రతిఒక్క ఉద్యోగి నుంచి ఒకరోజు మూలవేతనాన్ని రికవరీ చేసి ముఖ్యమంత్రి సహాయనిధికి అందించాలని ఎంప్లాయీస్ యూనియన్, ఎస్‌డబ్ల్యూఎఫ్, ఎన్ఎంయూ, టీజేఎంయూ, కేఎస్, ఎస్‌డబ్లూయూ కేపీ, బీడబ్ల్యూ యూనియన్ల నేతలు ఆర్టీసీ సీఎండీని కోరారు.
సీఎం సహాయనిధికి ఆర్టీసీ కార్మికుల ఒకరోజు వేతనం
కరోనా వైరస్ విస్తరిస్తోన్న నేపథ్యంలో ప్రభుత్వానికి బాసటగా నిలిచేందుకు ఆర్టీసీ కార్మికులు వారి ఒకరోజు మూలవేతనాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి ఇవ్వాలని నిర్ణయించారు. ఆ మొత్తాన్ని రికవరీ చేసి సహాయనిధికి అందజేయాలని ఆర్టీసీ యూనియన్ నేతలు ఆర్టీసీ సీఎండీ సునీల్ శర్మకు విజ్ఞప్తి చేశారు.
సీఎం సహాయనిధికి ఆర్టీసీ కార్మికుల ఒక రోజు జీతం
టీఎంయూ నేతలు సైతం ఒక నెల జీతాన్ని సీఎం సహాయనిధికి అందజేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి:కరోనాపై పోరాటానికి విరాళాల వెల్లువ
TAGGED:
rtc cmd sunil sharma