తెలంగాణ

telangana

ETV Bharat / city

TSRTC Corgo: వచ్చే నెల నుంచి బెంగళూరులో ఆర్టీసీ కార్గో సేవలు

ఆర్టీసీ అంటే నమ్మకం. ఆ నమ్మకాన్నే ఆర్టీసీ వ్యాపారంగా మార్చుకునేందుకు కార్గో, పార్శీల్, కొరియర్ సేవలను ప్రారంభించింది. ఇప్పటికే టీఎస్ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలకు కార్గో, కొరియర్, పార్శిల్ సేవలను విస్తరించింది. తాజాగా కర్ణాటకలోని బెంగళూరుకు తమ సేవలను విస్తరించనున్నట్లు ఆర్టీసీ సంస్థ వెల్లడించింది.

TSRTC Corgo
ఆర్టీసీ కార్గో సేవలు

By

Published : Sep 1, 2021, 4:46 PM IST

ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రకు కార్గో, కొరియర్, పార్శిల్ సేవలను విస్తరించిన టీఎస్ఆర్టీసీ తాజాగా తాజాగా కర్ణాటకలోని బెంగళూరుకు తమ సేవలను విస్తరించనున్నట్లు తెలిపింది. వచ్చే నెల మొదటి వారంలో బెంగుళూరులో డోర్ డెలివరీ సేవలను ప్రారంభించనున్నట్లు ఆర్టీసీ ఓఎస్టీ కృష్ణకాంత్ తెలిపారు. బెంగళూరులోని 14 ప్రాంతాల్లో ఈ సేవలను అందించేందుకు గుబేరా ఏజెన్సీ ముందుకు వచ్చింది. ఐదేళ్ల వరకు ఈ సేవలను అందించేందుకు ఒప్పందం చేసుకున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇప్పటికే గుబేరా ఏజెన్సీ అక్కడ తన కార్యకలాపాలు కొనసాగిస్తుంది. తాజాగా ఆ సంస్థ ప్రతినిధులు టీఎస్ఆర్టీసీతో ఒప్పందం చేసుకున్నారు.

14 ప్రాంతాల్లో డోర్ డెలివరీ

మెజెస్టిక్, ఇందిరనగర్, దమ్లూర్, మరతహలి, వైట్ ఫీల్డ్, హెచ్.ఎస్.ఆర్ లేఅవుట్, బొమ్మనహలి, ఎలక్ట్రానిక్ సిటీ, దొడ్డకమ్మనహల్లి, జేపీ నగర్, జయనగర్, కోర్ మంగల, లాల్ భాగ్, శాంతినగర్ ప్రాంతాల్లో ఆర్టీసీ డోర్ డెలివరీ చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తుందని ఆర్టీసీ ఓఎస్డీ కృష్ణకాంత్ పేర్కొన్నారు. గుళూరులో టీఎస్ఆర్టీసీ కార్గో, కొరియర్, పార్శిల్ సేవలు అందుబాటులోకి వస్తే.. తిరోజూ కనీసం రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఆదాయం వస్తుందని ఆర్టీసీ అధికారులు అంచనావేస్తున్నారు. బెంగుళూరులోని 14 ప్రాంతాలకు డోర్ డెలివరీ చేసేందుకు తీసుకునే ఛార్జీలను ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. దూరాన్ని బట్టి ఒక్కో ప్రాంతంలో ఒక్కో ధరను తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

ధరలు ఇలా..

మెజిస్టిక్, ఇందిరనగర్ ప్రాంతాల్లో 1-10 కేజీల వరకు రూ.100, 10-25 కేజీల వరకు రూ.160, 25-50కేజీల వరకు రూ.260, 50-75 కేజీల వరకు రూ.350, 75-100కేజీల వరకు రూ.400 చార్జీ తీసుకుంటారు. దొమ్లూర్​-1-10 కేజీల వరకు రూ.100, 10-25 రూ.170, 25-50 రూ.260, 50-75 రూ.350, 75-100 రూ.400. మరతహల్లి -1-10కేజీలకు రూ.120, 10-25కేజీలకు రూ.170, 25-50కేజీలకు రూ.280, 50-75కేజీలకు రూ.360, 75-100కేజీలకు రూ.410. వైట్ ఫీల్డ్ -1-10కేజీలకు రూ.120, 10-25 కేజీలకు రూ.170, 25-50కేజీలకు రూ.280, 50-75కేజీలకు రూ.370, 75-100కేజీలకు రూ.410 గా నిర్ణయించారు.

హెచ్.ఎస్.ఆర్ లేఅవుట్ -1-10కేజీలకు రూ.120, 10-25 కేజీలకు రూ.170, 25-50కేజీలకు రూ.280, 50-75కేజీలకు రూ.370, 75-100కేజీలకు రూ.420, బొమ్మనహల్లి-1-10కేజీలకు రూ.130, 10-25 కేజీలకు రూ.180, 25-50కేజీలకు రూ.390, 50-75కేజీలకు రూ.370, 75-100కేజీలకు రూ.420. ఎలక్ట్రానిక్ సిటీ-1-10కేజీలకు రూ.130, 10-25 కేజీలకు రూ.180, 25-50కేజీలకు రూ.290, 50-75కేజీలకు రూ.370 75-100కేజీలకు రూ.420. దొడ్డకమ్మనహల్లి-1-10కేజీలకు రూ.130, 10-25 కేజీలకు రూ.180, 25-50కేజీలకు రూ.300, 50-75కేజీలకు రూ.380, 75-100కేజీలకు రూ.420. జేపీనగర్-1-10కేజీలకు రూ.130, 10-25 కేజీలకు రూ.180, 25-50కేజీలకు రూ.300, 50-75కేజీలకు రూ.390, 75-100కేజీలకు రూ.440 వసూలు చేయనున్నారు.

జయనగర్-1-10కేజీలకు రూ.120, 10-25 కేజీలకు రూ.170, 25-50కేజీలకు రూ.300, 50-75కేజీలకు రూ.390లు, 75-100కేజీలకు రూ.440. కొర్మన్ గల-1-10కేజీలకు రూ.120, 10-25 కేజీలకు రూ.160, 25-50కేజీలకు రూ.290, 50-75కేజీలకు రూ.380, 75-100కేజీలకు రూ.430, లాల్ భాగ్-1-10కేజీలకు రూ.120, 10-25 కేజీలకు రూ.150, 25-50కేజీలకు రూ.280, 50-75కేజీలకు రూ.370, 75-100కేజీలకు రూ.420. శాంతినగర్-1-10కేజీలకు రూ.120, 10-25 కేజీలకు రూ.150, 25-50కేజీలకు రూ.260, 50-75కేజీలకు రూ.360, 75-100కేజీలకు రూ.410. కవర్స్-1,000గ్రాముల వరకు రూ.70లు ఛార్జీలు వసూలు చేస్తారు.

ఇదీ చదవండి:Dalit Bandhu: మరో నాలుగు మండలాల్లో దళితబంధు.. ఏ జిల్లాల్లో అంటే...

ABOUT THE AUTHOR

...view details