జనవరి 1 నుంచి కార్గో సేవలు అందించనున్న ఆర్టీసీ - జనవరి 1 నుంచి ఆర్టీసీ కార్గో సేవలు
17:26 December 19
రాష్ట్రంలో కార్గో సర్వీసులను ప్రారంభించేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. జనవరి 1 నుంచి కార్గో సర్వీసులు ప్రారంభం కానున్నాయని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ వెల్లడించారు. ఆర్టీసీ ఈడీల సమావేశంలో మంత్రి పువ్వాడ కార్గో సర్వీసులపై వివరించారు. కార్గో బస్సులను ఎర్రరంగుతో తీర్చిదిద్దాలని నిర్ణయించినట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ బస్సులకు డ్రైవర్, సిబ్బందికి ప్రత్యేక డ్రెస్ కోడ్ కేటాయించనున్నారు.
ప్రజాప్రతినిధులందరూ బస్సుల్లో ప్రయాణించాలని మంత్రి పువ్వాడ లేఖలు రాశారు. మంగళవారం గ్రేటర్ పరిధిలోని అన్ని డిపోల ఉద్యోగులతో వన భోజనాలు చేయాలని మంత్రి పువ్వాడ నిర్ణయించారు.