TSPSC OTR: త్వరలో భర్తీ చేయనున్న ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి వన్‌టైం రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) తప్పనిసరని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పష్టం చేసింది. కొత్త అభ్యర్థులు తమ వివరాలు నమోదు చేసుకోవాలని... ఇప్పటికే నమోదు చేసుకున్న వారు ఓటీఆర్ సవరించుకోవాలని టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనిత రామచంద్రన్ సూచించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం కొత్త జిల్లా, జోన్లు, ఒకటి నుంచి ఏడో తరగతి వరకు వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. త్వరలోనే నోటిఫికేషన్లు రానున్నందున... చివరి నిమిషం వరకు వేచి చూడకుండా ఓటీఆర్‌తో సిద్ధంగా ఉండాలని కమిషన్ తెలిపింది. ఓటీఆర్ కీలకమని.. వాటిలోని వివరాలే దరఖాస్తులో ఉంటాయని పేర్కొంది. ఓటీఆర్ వల్ల కొన్ని నిమిషాల్లోనే దరఖాస్తుల ప్రక్రియ పూర్తవుతుందని టీఎస్పీఎస్సీ కార్యదర్శి తెలిపారు.
రిజిస్ట్రేషన్లు ఇలా...
- టీఎస్పీఎస్సీ వెబ్‌సైట్‌లో ‘న్యూ రిజిస్ట్రేషన్’పై క్లిక్ చేయాలి. మొబైల్ నంబరు ఎంటర్చేయాలి. ఈ నంబరుకు ఓటీపీ వస్తుంది. దీన్ని నమోదు చేయాలి.
- దరఖాస్తు ఫారంలో వ్యక్తిగత సమాచారం, చిరునామా, ఈ-మెయిల్ ఐడీ, 1-7వ తరగతి వరకు 33 జిల్లాల ప్రాతిపదికన వివరాలు, విద్యార్హతలు నమోదుచేశాలి.
- అభ్యర్థి ఫొటో, సంతకం అప్‌లోడ్ చేయాలి. ఈ వివరాలన్నీ సబ్మిట్ చేసిన తరవాత టీఎస్పీఎస్సీ ఐడీ వస్తుంది. దీంతో పాటు జనరేట్ అయ్యే పీడీఎఫ్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- ఒకవేళ సబ్మిట్ కన్నా కన్నా ముందుగానే ‘లాగ్‌అవుట్’ అయితే మళ్లీ మొదటి నుంచి చేయాలి.