నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. టీఎస్పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్ - మున్సిపల్‌శాఖలో ఉద్యోగ ప్రకటన
18:36 September 07
మున్సిపల్‌శాఖలో 175 ఉద్యోగాలకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్
TSPSC Job Notification: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రకటనల జోరు కొనసాగుతోంది. తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. మున్సిపల్ శాఖలో 175 టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 20వ తేదీ నుంచి అక్టోబరు 13 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ ప్రకటనలో తెలిపింది.
రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ అధికారి పోస్టుల భర్తీకి ఈ నెల 5న టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. 23 పోస్టులకు టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 13వ తేదీ నుంచి అక్టోబరు 10వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ పేర్కొంది.
ఇవీ చదవండి: