TSPSC CHAIRMAN MEETS GOVERNOR: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగాల భర్తీకి సంబంధించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్‌రెడ్డి అన్నారు. అదేవిధంగా 2020-21 ఉద్యోగ భర్తీకి సంబంధించిన నివేదికను ఆయన గవర్నర్‌కు అందించారు.
గతేడాది టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ అయిన ఉద్యోగాలు ఎన్నో తెలుసా? - గవర్నర్ తమిళిసై తాజా సమాచారం
TSPSC CHAIRMAN MEETS GOVERNOR: ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగాల భర్తీకి సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి తెలిపారు. 2020-21 ఉద్యోగ భర్తీకి సంబంధించిన నివేదికను గవర్నర్‌కు ఆయన సమర్పించారు.
రాజ్ భవన్లో గవర్నర్ తమిళిసైను కలిసి ఛైర్మన్, అధికారులు నివేదికను సమర్పించారు. గత ఏడాది మూడు నోటిఫికేషన్ల ద్వారా 149 ఖాళీలను భర్తీ చేసినట్లు పేర్కొన్నారు. మొత్తం 10,630 మంది అభ్యర్థులు పరీక్ష రాశారని తెలిపారు. గత నోటిఫికేషన్లతో కలిపి మొత్తం 2,370మంది అభ్యర్ధులు ఎంపిక అయినట్లు నివేదికలో వెల్లడించారు. నివేదికను పరిశీలించిన గవర్నర్.. టీఎస్పీఎస్సీ అధికారులను అభినందించారు.
ఇదీ చదవండి:CM KCR Statements: వీఆర్ఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లకు గుడ్‌న్యూస్.. అసెంబ్లీలో సీఎం ప్రకటన..