ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో తీసుకునే నిర్ణయాలకు రాష్ట్ర ప్రజలు సహకరించాలని రాష్ట్ర పరిశ్రమల, ఉపాధి కల్పన సంస్థ ఛైర్మన్ గ్యాదరి బాలమల్లు కోరారు. బషీర్బాగ్ పరిశ్రమల భన్లో ఔట్సోర్సింగ్, అటెండర్లు, డ్రైవర్లు, పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరకులు అందజేశారు. సీఎం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్లనే రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రించగలిగినట్టు తెలిపారు. కార్యక్రమంలో పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పాల్గొన్నారు.
'మంత్రివర్గ నిర్ణయాలకు ప్రజలు సహకరించాలి' - పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి
ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు జాగ్రత్తల వల్లనే రాష్ట్రంలో కరోనాను నియంత్రించగలిగామని టీఎస్ఐఐసీ ఛైర్మన్ గ్యాదరి బాలమల్లు అన్నారు. బషీర్బాగ్ పరిశ్రమల భవన్లో సిబ్బందికి నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

'మంత్రివర్గ నిర్ణయాలకు ప్రజలు సహకరించాలి'