ఉద్యోగ భద్రతపై వారంలో కీలక నిర్ణయం తీసుకుంటామని ఆర్టీసీ ఇంఛార్జీ ఎండీ సునీల్ శర్మ స్పష్టం చేశారు. ఉద్యోగుల బాగోగుల కోసం సంక్షేమ కమిటీలను ఏర్పాటు చేశామని... సమస్యలను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉద్యోగుల ఓడీలు బదిలీలకు సంబంధించిన అంశాలపై చర్చిస్తున్నామన్నారు. బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కల్యాణ మండపంలో ఇంధనం అధికంగా వాడకు- పర్యావరణాన్ని పరిరక్షించు అనే నినాదంతో నిర్వహించిన బెస్టు కేఎంపీఎల్ అవార్డుల ప్రదానోత్సవానికి సునిల్ శర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
'ఆర్టీసీ కార్మికుల ఉద్యోగ భద్రతపై వారంలో కీలక నిర్ణయం' - తెలంగాణ ఆర్టీసీ అవార్డులు
ఆర్టీసీ లాభాల బాటల్లోకి వచ్చేసిందని త్వరలో అందుబాటులోకి రానున్న కార్గో బస్సులతో మరింత లాభాల్లోకి వస్తుందని ఆర్టీసీ ఇంఛార్జీ ఎండీ సునీల్ శర్మ ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్‌లో బోనస్ ఇవ్వాలనే ఆలోచన ఉందని పేర్కొన్నారు. పీఎఫ్, సీపీఎఫ్ బకాయిలను త్వరలోనే చెల్లిస్తామన్నారు. ఇంధనం పొదుపు చేసిన 11 మంది డ్రైవర్లకు అవార్డులు ప్రదానం చేశారు.
rtc md
ఇంధనం పొదుపు చేసిన 11 మంది డ్రైవర్లకు అవార్డులు ప్రదానం చేశారు. ఇంధనం పొదుపు చేసిన వారిలో నిజామాబాద్ డిపోకు చెందిన డ్రైవర్ జి నర్సయ్యకు మొదటిస్థానం, హబీబుద్దీన్ రెండో స్థానం, సైదులుకు మూడో స్థానం లభించింది.