తెలంగాణ

telangana

ETV Bharat / city

TSRTC Special Offer: రూ. వంద చెల్లించండి.. రోజంతా ప్రయాణించండి - TS RTC MD Sajjanar said pay Rs 100 and travel all day

భాగ్యనగరవాసులకు శుభవార్త. కేవలం వంద రూపాయలతో నగరంలో ఎంత దూరమైన ప్రయాణించవచ్చు. రూ.వంద చెల్లించి రోజంతా హైదరాబాద్‌లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లొచ్చని.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్​(tsrtc md vc sajjanar) తెలిపారు.

TSRTC Special Offer
రూ. వంద చెల్లించండి.. రోజంతా ప్రయాణించండి

By

Published : Nov 3, 2021, 9:40 AM IST

పెట్రోలు ధర పెరిగిందని ఆందోళన వద్దని.. రూ.వంద చెల్లించి రోజంతా హైదరాబాద్‌లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ (tsrtc md vc sajjanar) మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. టీ-24 పేరిట 24 గంటలపాటు చెల్లుబాటు అయ్యేలా టికెట్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు.

కండక్టర్ల వద్ద టీ-24 టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ టికెట్‌తో ఆర్డినరీ, సబర్బన్‌, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌ బస్సుల్లో 24 గంటల వ్యవధిలో ఎంత దూరమైనా ప్రయాణం చేయవచ్చన్నారు. విధుల్లో ఉండగా డ్రైవర్లు పాన్‌ మసాలాలు, గుట్కాలు తినకూడదని ఉత్తర్వులు జారీ చేసినట్లు మరో ప్రకటనలో తెలిపారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details