KTR At Kandlakoya IT Park: చివరి వరకు పట్టుదలతో పోరాడితేనే విజయం లభిస్తుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా తొలి ఎన్నికలో ఓడిపోయారని కేటీఆర్ చెప్పారు. తొలి ఓటమితో నిరుత్సాహపడకుండా రాజకీయాల్లో కొనసాగారన్నారు. రాజకీయాల్లో కొనసాగి పట్టువిడవని పోరాటంతో తెలంగాణను సాధించారని పేర్కొన్నారు. ఒకవేళ కేసీఆర్ రాజకీయాలను వీడితే ఇవాళ తెలంగాణ సాధించి ఉండేవాళ్లమా? అని కేసీఆర్ అన్నారు.
తెలంగాణ గేట్‌వే..
సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా హైదరాబాద్ కండ్లకోయలో ఐటీ పార్కుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. తెలంగాణ గేట్‌వే పేరిట మేడ్చల్ జిల్లా కండ్లకోయ ఓఆర్ఆర్ భారీ ఐటీ పార్క్‌ను నిర్మిస్తున్నారు. ఇందుకోసం రూ.వంద కోట్ల ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. పది ఎకరాల్లో 40 మీటర్ల ఎత్తు, 14 అంతస్తులతో ఐటీ పార్కును నిర్మిస్తున్నారు. ఫలితంగా 5 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలం అందుబాటులోకి రానుంది. ఈ ఐటీ పార్కులో 70 కంపెనీల ద్వారా 50 వేల మందికి ఉపాధి కల్పించనున్నారు. ఈ భాధ్యతలను టీఎస్ఐఐసీకి అప్పగించింది. ఇప్పటికే 70కి పైగా సంస్థలు కార్యాలయ స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఈ పార్కులో సమావేశ మందిరాలు, భారీ పార్కింగు తదితర సౌకర్యాలు కల్పించనున్నారు.
ఐటీ పార్క్‌తో కండ్లకోయ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే టాప్-5 కంపెనీల క్యాంపస్‌లు హైదరాబాద్‌లో ఉన్నాయని కేటీఆర్ చెప్పారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి సంస్థల అతిపెద్ద క్యాంపస్‌లు హైదరాబాద్‌లో ఉన్నాయన్నారు. పలు సంస్థలకు అమెరికా వెలుపల ప్రధాన క్యాంపస్‌లు హైదరాబాద్‌లోనే ఉన్నాయని పేర్కొన్నారు.
'ప్రభుత్వ ప్రాధాన్యతల్లో హైదరాబాద్ ఐటీ రంగం ఒకటి. కేంద్ర సగటును మించి రాష్ట్ర ఐటీ రంగం వృద్ధి నమోదుచేస్తోంది. కొవిడ్ పరిస్థితుల్లోనూ మన ఐటీరంగం రెండంకెల వృద్ధిని నమోదు చేసి సత్తా చాటింది. ఐటీని హైదరాబాద్ పశ్చిమ వైపునే కాకుండా.. నగరం నలువైపులా, రాష్ట్రంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విస్తరించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా గ్రిడ్ పాలసీని రూపొందించాం. హైదరాబాద్ తూర్పు, ఉత్తర ప్రాంతాల్లో ఐటీ పార్కులు ఏర్పాటుచేసి కంపెనీలు నెలకొల్పేలా ప్రోత్సాహం అందిస్తున్నాం. ఈ ఐటీ పార్క్‌లో 50 వేల మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయి.'
- కేటీఆర్, రాష్ట్ర ఐటీశాఖ మంత్రి
హైదరాాబాద్ వ్యాక్సిన్ కేపిటల్..