పెను సవాలుగా మారిన సైబర్ నేరాలు: జయేశ్ రంజన్ - సైబర్ నేరాలు
ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్ నేరాలు పెను సవాలుగా మారాయని ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ పేర్కొన్నారు. సైబర్ నేరాల - సంసిద్ధత అనే అంశంపై జరిగిన సదస్సులో పాల్గొన్న ఆయన.. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరముందన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్ నేరాలు పెను సవాలుగా మారాయని ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ పేర్కొన్నారు. కొవిడ్ కాలంలో జరిగిన సైబర్ నేరాలపై నిపుణులు విశ్లేషణలు చూస్తే... ఈ విషయం స్పష్టం అవుతోందన్నారు. సైబర్ నేరాలు-సంసిద్థత అనే అంశంపై.. హైదరాబాద్‌లో జరిగిన సదస్సులో జయేష్ రంజన్ పాల్గొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సమాజానికి ఎంత మేలు చేస్తుందో.. అంతే ఇబ్బందులకు గురిచేస్తోందని వివరించారు. సైబర్ నేరాలపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.