తెలంగాణ

telangana

By

Published : Jul 26, 2020, 5:29 AM IST

ETV Bharat / city

బక్రీద్‌ సందర్భంగా గోవులను వధించవద్దు: హోంమంత్రి

బక్రీద్‌ సందర్భంగా గోవులను వధించవద్దని ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ ముస్లింలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో అన్ని మతాలను గౌరవించుకుంటున్నామని, ఇదే తరహాలో బక్రీద్‌ను జరుపుకొందామన్నారు.

బక్రీద్‌ సందర్భంగా గోవులను వధించవద్దు: హోంమంత్రి
బక్రీద్‌ సందర్భంగా గోవులను వధించవద్దు: హోంమంత్రి

బక్రీద్‌ సందర్భంగా గోవులను వధించవద్దని ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ ముస్లింలకు విజ్ఞప్తి చేశారు. బక్రీద్‌ సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై డీజీపీ మహేందర్‌రెడ్డితో శనివారం సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో అన్ని మతాలను గౌరవించుకుంటున్నామని, ఇదే తరహాలో బక్రీద్‌ను జరుపుకొందామని అన్నారు.

చార్మినార్‌లోని 4 మినార్లను హిందూ, ముస్లిం, సిక్కు, క్రిస్టియన్‌లుగా భావిస్తామన్నారు. అన్ని మతాలను, కులాలను సమానంగా గౌరవించుకుందామని మహమూద్‌ అలీ పిలుపునిచ్చారు. వ్యర్థాలను రోడ్డు, వీధుల్లో పారవేయవద్దని అన్నారు. పరిశుభ్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, కరోనా వ్యాప్తి దృష్ట్యా భౌతికదూరం పాటించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details