తెలంగాణ

telangana

ETV Bharat / city

'డయాగ్నస్టిక్స్ కేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి'

డయాగ్నస్టిక్స్ కేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర హోంమంత్రి మహమూద్​ అలీ సూచించారు. పనిపురాలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగ నిర్ధారణ కేంద్రాలను ఆయన ప్రారంభించారు.

By

Published : Jan 22, 2021, 1:14 PM IST

ts home minister
సామాజిక ఆరోగ్య కేంద్రంలో డయాగ్నస్టిక్స్ సెంటర్​ ప్రారంభం

హైదరాబాద్​ పనిపురాలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో డయాగ్నస్టిక్స్ కేంద్రాన్ని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్​ అలీ ప్రారంభించారు. ఇప్పటికే బస్తీ దవాఖానాల వల్ల ప్రజలకు ఎంతో మేలు జరిగిందని.. ఈ కేంద్రాలనూ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్​, వైద్యారోగ్య శాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

సామాజిక ఆరోగ్య కేంద్రంలో డయాగ్నస్టిక్స్ సెంటర్​ ప్రారంభం

అల్ట్రాసౌండ్ స్కానింగ్, ఈసీజీ, ఎక్స్​రే సహా సుమారు 52 రక్తపరీక్షలను ఇక్కడ ఉచితంగా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎంఈ రమేశ్​రెడ్డి, ఆస్పత్రి వైద్యులు డాక్టర్ నందిత, డాక్టర్ సూర్య శ్రీ, ల్యాబ్ మేనేజర్ రాజా సురేష్ పాల్గొన్నారు.

సామాజిక ఆరోగ్య కేంద్రంలో డయాగ్నస్టిక్స్ సెంటర్​ ప్రారంభం
'డయాగ్నస్టిక్స్ కేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి'

ABOUT THE AUTHOR

...view details