కరోనా నేపథ్యంలో వాయిదా పడ్డ పాలిసెట్‌ను ఆగస్టులో నిర్వహించాలని రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి నిర్ణయించింది. పాలిసెట్‌కు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకునేందుకు మరో అవకాశం కల్పించినట్లు ఎస్‌బీటీఈటీ తెలిపింది. ఈ నెల 13 నుంచి 25 వరకు రూ.200 లతో ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చుని మండలి కార్యదర్శి తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం చేపడుతోన్న చర్యల్లో భాగంగా పాలిసెట్- 2020ని వాయిదా వేసింది ఎస్‌బీటీఈటీ.
ఆగస్టులో పాలిసెట్ నిర్వహణకు విద్యామండలి నిర్ణయం - టీఎల్ పాలిసెట్-2020
కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో వాయిదా పడ్డ టీఎస్ పాలిసెట్-2020ని ఆగస్టులో నిర్వహించాలని రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి నిర్ణయించింది. పాలిసెట్ దరఖాస్తుకు మరో అవకాశం కల్పించామని... ఈ నెల 13 నుంచి 25 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చుని మండలి కార్యదర్శి తెలిపారు.
ఆగస్టులో పాలిసెట్ నిర్వహణకు విద్యామండలి నిర్ణయం
ఎస్సీ గురుకుల జూనియర్ కాలేజీల్లో మొదటి సంవత్సరంలో చేరేందుకు గడువు ఈ నెల 17 వరకు పొడిగించినట్టు సొసైటీ కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఎంపికైన విద్యార్థులు ఈ నెల 17లోగా ఆయా కాలేజీల్లో టీసీ, కుల, నివాస, ఆదాయ ధ్రువపత్రాలతో రిపోర్టు చేయాలని పేర్కొన్నారు. నిర్ణీత గడువులోగా చేరకపోతే అడ్మిషన్ రద్దవుతుందని తెలిపారు.