తెలంగాణ

telangana

By

Published : Oct 20, 2021, 10:10 AM IST

ETV Bharat / city

ts govt on gazette notification: 'తొందరపాటు లేదు.. ఏపీ షరతులతో సంబంధం లేదు'

నదీ యాజమాన్య బోర్డు(WATER MANAGEMENT BOARDS)కు ప్రాజెక్టుల స్వాధీనం కృష్ణా జలవివాదాల ట్రైబ్యునల్(krishna Water Disputes Tribunal ) ఆదేశాలకు అనుగుణంగా సాధ్యమా? కాదా? అన్న విషయమై తెలంగాణ ప్రభుత్వం(TELANGANA GOVERNMENT) అధ్యయనం చేస్తోంది. బచావత్ ట్రైబ్యునల్‌(bachawat tribunal)తో పాటు బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్‌(Brijesh Kumar Tribunal) ముందు పెడుతోన్న రాష్ట్ర వాదనలు, అవసరాలను ఇందుకోసం పరిగణలోకి తీసుకోనున్నారు. ప్రాజెక్టుల స్వాధీనానికి సంబంధించి ఎలాంటి తొందరపాటు లేదని... రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేలా రాజకీయ నిర్ణయం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.

ts govt on gazette notification
ts govt on gazette notification

కేంద్ర జలశక్తి శాఖ(Ministry of Jal Shakti) జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్(Gazette Notifications For KRMB, GRMB) ప్రకారం ఈ నెల 14న ప్రాజెక్టులను కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులకు అప్పగించాల్సి ఉంది. ఇందుకోసం కృష్ణా(KRMB), గోదావరి బోర్డు(GRMB)ల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా అందాయి. గోదావరికి సంబంధించి పెద్దవాగు ప్రాజెక్టు ఉండగా... కృష్ణాకు సంబంధించి శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు చెందిన9 ఔట్‌లెట్లు ఉన్నాయి. వీటిలో వేటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ బోర్డులకు అప్పగించలేదు. ఈ నెల 11, 12 తేదీల్లో జరిగిన బోర్డు సమావేశాల్లోని మినిట్స్‌ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ పరిధిలోని ఔట్‌లెట్లను స్వాధీనం చేసేందుకు షరతులతో కూడిన ఉత్తర్వులు ఇచ్చింది.

వెంటనే ఉత్తర్వులు జారీ చేసే పరిస్థితి లేదు..

అయితే తెలంగాణ((TELANGANA GOVERNMENT)) మాత్రం ప్రాజెక్టుల అప్పగింతపై ఇంకా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. బోర్డుల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా అధ్యయనం చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. బోర్డు నుంచి ప్రతిపాదనలు వచ్చిన వెంటనే ఉత్తర్వులు జారీ చేసే పరిస్థితి లేదని... చాలా సున్నితమైన, గంభీరమైన నదీజలాల అంశాని(WATER DISPUTES)కి సంబంధించి విస్తృతంగా చర్చించాల్సి ఉంటుందని, ప్రభావాన్ని అధ్యయనం చేయాల్సి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.

ప్రాజెక్టుల నిర్వహణ అంటే..

ప్రధానంగా కృష్ణా జలవివాదాల(krishna water dispute)కు సంబంధించి బచావత్ ట్రైబ్యునల్(bachawat tribunal) ఆదేశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని... ఆ ఆధారంగానే ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి ఏ మేరకు ఇవ్వవచ్చన్న అంశంపై పూర్తి స్థాయిలో చర్చించాల్సి ఉంటుందని అంటున్నారు అధికారులు. ప్రాజెక్టుల నిర్వహణ అంటే కేవలం నీటి విడుదల, నిర్వహణ మాత్రమే కాదని... ఎన్నో ఇతర అంశాలు కూడా ముడిపడి ఉంటాయని సర్కార్ అంటోంది. ఇందుకు సంబంధించి కేంద్ర జలసంఘం((Ministry of Jal Shakti)) ఇచ్చిన ముసాయిదా నిబంధనలు, ఆపరేషన్ ప్రోటోకాల్​ను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు.

పూర్తి స్థాయిలో అధ్యయనం చేశాకే..

వీటితో పాటు బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ (Brijesh Kumar Tribunal)ముందు రాష్ట్రం వినిపిస్తున్న వాదనలు, రాష్ట్ర అవసరాలు, హక్కులు ఇలా అన్ని అంశాలను పూర్తి స్థాయిలో అధ్యయనం చేశాకే బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులు ఇచ్చే అంశంపై ఓ అవగాహనకు రావాల్సి ఉంటుందని అంటున్నారు. ఇవన్నీ ఉన్న నేపథ్యంలో బోర్డు ప్రతిపాదనపై తక్షణమే నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉండదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. జూరాల(JURALA), శ్రీశైలం(SRISAILAM), నాగార్జునసాగర్‌(NAGARJUNA SAGAR) ప్రాజెక్టులకు సంబంధించి సీడబ్ల్యూసీ (CWC) ముసాయిదా నిబంధనలు, ఆపరేషన్ ప్రోటోకాల్స్‌తో పాటు బ్రిజేష్‌ కుమార్ ట్రైబ్యునల్‌(Brijesh Kumar Tribunal) ముందు వినిపిస్తున్న వాదనలు, రాష్ట్ర అవసరాలపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఇంజినీరింగ్, న్యాయనిపుణులతో ఏర్పాటు చేసిన ఈ కమిటీ నెలాఖరులోపు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో పాటు బోర్డు ప్రతిపాదనలను అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తామని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.

ఏపీతో సంబంధం లేదు..

ఆంధ్రప్రదేశ్(Government of Andhra Pradesh) ఇచ్చిన షరతులతో కూడిన ఉత్తర్వులతో తమకు సంబంధం లేదని చెప్తున్నారు తెలంగాణ అధికారులు. నిపుణులు, అధికారుల సమగ్ర అధ్యయనం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR)తుది నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. గోదావరి బోర్డు(GRMB)కు సంబంధించి కూడా ఇదే తరహా విధానం ఉంటుందని అంటున్నారు. ప్రక్రియ సాఫీగా సాగేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(KRMB) మూడు నెలల సమయాన్ని సంధికాలంగా పరిగణిస్తోంది. ఈ సమయాన్ని వినియోగించుకునే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం(TELANGANA GOVERNMENT)ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత కథనాలు..

ABOUT THE AUTHOR

...view details