కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేసేందుకు ముందుకువచ్చి ప్రాణదాతలుగా నిలువాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కోరారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్లాస్మా దాతల సంఘం ఏర్పాటు చేసిన గూడూరు నారాయణ రెడ్డితో మాట్లాడారు. ప్లాస్మా దాతల వివరాల సేకరణ కోసం అసోసియేషన్ చేస్తున్న కృషిని గవర్నర్‌కు వివరించారు.
'కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయండి' - గవర్నర్ తమిళిసై వార్తలు
కరోనా వైరస్ బారి నుంచి కొలుకున్న వారు ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు రావాలని గవర్నర్ విజ్ఞప్తి చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్లాస్మా దాతల సంఘం ఏర్పాటు చేసిన గూడూరు నారాయణ రెడ్డితో మాట్లాడారు.
'కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయండి'
కొవిడ్ నుంచి కోలుకున్న వారు నలభైవేలకుపైగా ఉన్నప్పటికీ... ఆశించిన స్థాయిలో ప్లాస్మా ఇవ్వడానికి ముందుకు రావడం లేదని చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఆయన కోరారు.