తెలంగాణ

telangana

ETV Bharat / city

25 వరకు ఎంసెట్​ అగ్రికల్చర్​ పరీక్ష హాల్​టికెట్​లు డౌన్​లోడ్​ ​ - ఎంసెట్​ అగ్రికల్చర్​ పరీక్ష హాల్​టికెట్

ఎంసెట్ అగ్రికల్చర్ విభాగం పరీక్షకు హాల్ టికెట్ల డౌన్ లోడ్ ప్రక్రియ ఇవాళ ప్రారంభమైంది. ఈనెల 25 వరకు ఎంసెట్ వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈనెల 28, 29 తేదీల్లో రోజుకు రెండు పూటలు అగ్రికల్చర్ ఎంసెట్ జరగనుంది.

ts emcet
ts emcet

By

Published : Sep 21, 2020, 10:07 PM IST

ఎంసెట్ అగ్రికల్చర్ విభాగం పరీక్షకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. హాల్ టికెట్ల డౌన్ లోడ్ ప్రక్రియ ఇవాళ ప్రారంభమైంది. ఈనెల 25 వరకు ఎంసెట్ వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. ఈనెల 28, 29 తేదీల్లో రోజుకు రెండు పూటలా అగ్రికల్చర్ ఎంసెట్ జరగనుంది.

తెలంగాణలో 67, ఏపీలో 17 కలిపి మొత్తం 84 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి 78,970 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష కేంద్రాన్ని ఒక రోజు ముందే వెళ్లి చూసుకోవాలని.. కన్వీనర్ సూచించారు. నమూనా పరీక్ష వెబ్ సైట్​లో ఉందని.. విద్యార్థులు ప్రాక్టీస్ చేయాలని సూచించారు. చీఫ్ సూపరింటెండెంట్లు, అబ్జర్వర్లకు శిక్షణ ఇస్తున్నట్లు కన్వీనర్ పేర్కొన్నారు.

ఇదీ చదవండి :'రాయగిరి కాదు.. ఇక నుంచి యాదాద్రి రైల్వేస్టేషన్​'

ABOUT THE AUTHOR

...view details