TS EAMCET Counseling: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల కోసం ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ తేదీలను పొడిగించారు. ధ్రువపత్రాల పరిశీలన కోసం ఆన్లైన్లో ప్రాసెసింగ్ రుసుము చెల్లించి.. స్లాట్ బుకింగ్ చేసుకొనే గడువు సెప్టెంబరు 1 వరకు పెంచారు. ధ్రువపత్రాల పరిశీలన సెప్టెంబరు 2 వరకు కొనసాగనుంది. వెబ్ఆప్షన్ల గడువును సెప్టెంబరు 3 వరకు పొడిగించినట్లు సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. కన్వీనర్ కోటాలో ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం నిన్నటి వరకు 74 వేల 773 మంది స్లాట్ బుక్ చేసుకొని.. వారిలో 62 వేల 383 మంది ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు.
ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ తేదీలు పొడిగింపు.. ప్రత్యేకంగా వాళ్ల కోసమే.. - ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్
TS EAMCET Counseling: ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ తేదీలను పొడిగించారు. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల కోసం కౌన్సెలింగ్ షెడ్యూల్ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాల్సిందిగా అధికారులు తెలిపారు.
TS EAMCET Engineering Counselling Dates Extended in telangana
ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ ప్రక్రియ ఆగస్టు 21న ప్రారంభమైంది. ఈ ఏడాది మూడు విడతల్లో సీట్లు భర్తీ చేయనున్నారు. ఆగస్టు 21 నుంచి 29 వరకు ఆన్ లైన్ కౌన్సెలింగ్ రుసుము చెల్లించి ధ్రువపత్రాల కోసం స్లాట్ బుకింగ్ తర్వాత.. 23 నుంచి 30 వరకు ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిన అభ్యర్థులు ఆగస్టు 23 నుంచి సెప్టెంబరు 2 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంది. కాగా.. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల కోసం మళ్లీ కౌన్సెలింగ్ తేదీలను పొడిగించారు.
ఇవీ చూడండి: