TS EAMCT 2022 Notification : ఎంసెట్, ఈసెట్ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఇంజినీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం జూన్ 14 నుంచి 20 వరకు ఆన్ లైన్లో జరగనున్న ఎంసెట్ కోసం ఏప్రిల్ 6 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 6 నుంచి మే 28 వరకు ఆన్ లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. ఇంజినీరింగ్ లేదా అగ్రికల్చర్ విభాగాల కోసం ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 400 రూపాయలు, ఇతరులు 800 రూపాయలు.. రెండూ రాసే అభ్యర్థులు 1600 రూపాయలు చెల్లించాలి.
పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ గణితం చదివిన విద్యార్థులు బీటెక్, బీఫార్మసీ రెండో సంవత్సరంలో చేరేందుకు నిర్వహించే ఈసెట్ నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. జులై 13న జరగనున్న ఈసెట్‌కు ఏప్రిల్ 6 నుంచి జూన్ 6 వరకు ఆన్ లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 400 రూపాయలు, ఇతరులు 800 రూపాయలు ఫీజు చెల్లించాలని కన్వీనర్ ప్రొఫెసర్ విజయ్ కుమార్ తెలిపారు. ఐసెట్, ఎడ్ సెట్, లాసెట్ షెడ్యూలు రేపు లేదా ఎల్లుండి ఖరారు చేసే అవకాశం ఉంది.
ఎంసెట్ జులై 14 నుంచి 5 రోజులపాటు జరగనుంది. జులై 14, 15 తేదీల్లో అగ్రికల్చర్, 18, 19, 20 తేదీల్లో ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు నిర్వహిస్తారు. ఎంసెట్‌ను రెండు రాష్ట్రాల్లో 105 కేంద్రాల్లో జరుపుతామని తెలిపారు. పాలిటెక్నిక్ విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్/బీఫార్మసీ రెండో ఏడాదిలో చేరేందుకు ఈసెట్‌ను జులై 13న జరపాలని నిర్ణయించామన్నారు. ఎంసెట్, ఈసెట్‌కు సంబంధించి తాజాగా నోటిఫికేషన్లు విడుదల చేశారు.