రాష్ట్రంలో కొత్తగా 1,771 కరోనా కేసులు,13 మరణాలు - కొత్త కరోనా కేసులు
![రాష్ట్రంలో కొత్తగా 1,771 కరోనా కేసులు,13 మరణాలు ts-corona-cases](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12110930-32-12110930-1623505828011.jpg)
18:48 June 12
రాష్ట్రంలో కొత్తగా 1,771 కరోనా కేసులు,13 మరణాలు
నిన్నటితో పోలిస్తే రాష్ట్రంలో ఈ రోజు కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఇవాళ కొత్తగా 1,771 మంది వైరస్ బారిన పడగా.. 13 మరణాలు నమోదయ్యాయి. మహమ్మారి నుంచి మరో 2,384 మంది బాధితులు విముక్తి పొందారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యరోగ్యాశాఖ బులెటిన్ విడుదల చేసింది.
రాష్ట్రంలో ప్రస్తుతం 22,133 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఇవాళ ఒక్కరోజే 1,20,525 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 171 కరోనా కేసులు నమోదయ్యాయి.