టీఆర్టీ అభ్యర్థులు హైదరాబాద్లోని ప్రగతిభవన్ ముట్టడికి యత్నించారు. 250 మంది అర్హత సాధించిన అభ్యర్థులు ప్రగతిభవన్ వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అప్రమత్తమైన పంజాగుట్ట పోలీసులు నిరసన అడ్డుకునేందుకు వెళ్లారు. నిరసనకారులను అదుపులోకి తీసుకుని పోలీసులు అక్కడినుంచి తరలించారు.
ప్రగతిభవన్ ముట్టడికి యత్నించిన టీఆర్టీ అభ్యర్థులు
ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అర్హత సాధించిన టీఆర్టీ అభ్యర్థులు ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.
ప్రగతిభవన్ ముట్టడికి యత్నించిన టీఆర్టీ అభ్యర్థులు