ప్రగతిభవన్ ముట్టడికి టీఆర్టీ అభ్యర్థుల యత్నం - trt candidates tried to blockade pragathi bhavan
అర్హత సాధించిన తమకు వెంటనే పోస్టులు కేటాయించాలంటూ టీఆర్టీ అభ్యర్థులు ప్రగతిభవన్ ముట్టడికి యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.
టీఆర్టీ అభ్యర్థులు ప్రగతిభవన్ ముట్టడికి యత్నించారు. అర్హత సాధించిన వారికి వెంటనే పోస్టులు కేటాయించాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వానికి విన్నవించారు. భారీగా అభ్యర్థులు తరలిరావడం వల్ల వారిని నిలువరించడంలో పోలీసులకు అభ్యర్థులకు వాగ్వాదం జరిగింది. పోలీసులు అరెస్టు చేసేందుకు యత్నించడంతో అభ్యర్థులు జాతీయ గీతాన్ని ఆలపించారు. వీరికి కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి మద్దతు తెలిపారు. టీఆర్టీ అభ్యర్థుల ధర్నాతో ప్రగతిభవన్ వద్ద భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది.
- ఇదీ చూడండి : చర్చలు విఫలం... సమ్మె యథాతథం