టీఆర్టీ, ఎస్జీటీ ఫలితాలు ప్రకటించి పోస్టింగ్ ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడానికి ప్రగతి భవన్‌కు వెళ్తే తమను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని వారు ఖండించారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం సెప్టెంబర్ 30వ తేదీ లోపు టీఆర్టీ-2017, ఎస్జీటీ ఫలితాలు ప్రకటించాలని టీఎస్పీఎస్సీకి తెలియజేసిందన్నారు. కానీ నేటి వరకు కమిషన్ నుంచి ఎలాంటి స్పందన రానందున... ఎస్జీటీ అభ్యర్థులందరూ ప్రగతి భవన్‌ను ముట్టడించామని తెలిపారు. అభ్యర్థులను అరెస్టు చేసి గోషామహల్ స్టేడియంకు తరలించారు. వారు అక్కడ వినూత్నంగా నిరసన తెలిపారు. తమను ప్రభుత్వం ఫుట్బాల్లాగా ఆడుకుంటోందని... అభ్యర్థులు ఫుట్‌బాల్ ఆడుతూ నిరసన తెలిపారు.
ఫుట్‌బాల్ ఆడుతూ వినూత్న నిరసన - trt candidates
టీఆర్టీ, ఎస్జీటీ ఫలితాలు ప్రకటించి పోస్టింగ్ ఇవ్వాలని ప్రగతి భవన్ ముట్టడికి వెళ్లిన అభ్యర్థులను పోలీసులు అరెస్టు చేసి గోషామహల్ స్టేడియంకు తరలించారు. అక్కడ అభ్యర్థులు ప్రభుత్వం తమను ఫుట్బాల్లాగా ఆడుకుంటోందని వినూత్న రీతిలో ఫుట్‌బాల్ ఆడుతూ నిరసన తెలిపారు.
ఫుట్‌బాల్ ఆడుతూ వినూత్న నిరసన