తెలంగాణ

telangana

ETV Bharat / city

రేపు టీఆర్​ఎస్​ఎల్పీ కీలక భేటీ.. దిల్లీలో రైతుదీక్ష? - telangana latest news

TRSLP MEET
TRSLP MEET

By

Published : Nov 15, 2021, 4:34 PM IST

Updated : Nov 15, 2021, 5:22 PM IST

16:32 November 15

రేపు కేసీఆర్‌ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం

రేపు తెరాస శాసనసభ పక్షం సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రేపు సాయంత్రం 4 గంటలకు శాసనసభ పక్షం భేటీ కానుంది. ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వం, భాజపా వైఖరిపై సమావేశంలో చర్చించనున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఒక తీరు, రాష్ట్ర భాజపా మరో తీరుగా వ్యవహరిస్తూ రైతులను అయోమయానికి గురి చేస్తోందని తెరాస ఆరోపిస్తోంది. ఈనెల 12న నియోజవర్గాల వారీగా ధర్నాలు కూడానిర్వహించింది. కేంద్రం స్పష్టతనిచ్చే వరకూ ఆందోళనలు కొనసాగిస్తామని ఇప్పటికే ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. రేపు భవిష్యత్తు కార్యచరణను ఖరారు చేయనుంది.  

దిల్లీలో రైతుదీక్ష..

సీఎం కేసీఆర్ నేతృత్వంలో దిల్లీలో రైతుదీక్ష లేదా ధర్నా చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర సమితి భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వంపై ముప్పేట దాడికి ప్రణాళిక చేస్తున్న గులాబీ పార్టీ... వాటిపై రేపటి సమావేశంలో చర్చించనుంది. కేంద్రం వైఖరి, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం, భాజపా అనుసరిస్తున్న వైఖరితో పాటు.. విపక్షాల ప్రచారాన్ని ఎలా తిప్పికొట్టాలనే విషయాలపైనా కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. దిల్లీ స్థాయి ఆందోళనతో పాటు.. రాష్ట్రంలో ఏ రూపంలో కొనసాగించాలో రేపు వ్యూహాలను ఖరారు చేయనున్నారు. 

ఇదీచూడండి:

Last Updated : Nov 15, 2021, 5:22 PM IST

ABOUT THE AUTHOR

...view details