తెలంగాణ

telangana

ETV Bharat / city

కంటోన్మెంట్​ను జీహెచ్​ఎంసీ పరిధిలోకి తెస్తాం - trs working president promises to cantonment people

కంటోన్మెంట్​ పరిధిలోని పేదల ఇళ్ల నిర్మాణం కోసం పది సార్లు కేంద్రం చుట్టూ తిరిగామని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ తెలిపారు. ఎన్నిసార్లు లేఖలు రాసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. సికింద్రాబాద్ సమీపంలోని కంటోన్మెంట్​లో నిర్వహించిన రోడ్​షోలో కేటీఆర్​ పాల్గొన్నారు. కంటోన్మెంట్​ను జీహెచ్​ఎంసీలో కలిపేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

కంటోన్మెంట్​లో నిర్వహించిన రోడ్​షోలో కేటీఆర్​

By

Published : Apr 3, 2019, 8:45 PM IST

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోవడం లేదని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. కంటోన్మెంట్​ పరిధిలోని పేదల ఇళ్ల నిర్మాణం కోసం కేంద్రం పరిధిలోనిభూమిని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తే... మోదీ సర్కారుపట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. అందుకు బదులుగా 500 ఎకరాల రాష్ట్ర ప్రభుత్వ భూమిని ఇస్తామన్నా స్పందించలేదని కంటోన్మెంట్​లో నిర్వహించిన రోడ్​షోలో ఆరోపించారు. లోక్​సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి 16 మంది ఎంపీలను గెలిపించుకుని.. కేంద్రంలో క్రియాశీలక పాత్ర పోషించబోతున్నామని స్పష్టం చేశారు. మల్కాజిగిరి ఎంపీగా మర్రిరాజశేఖర్​రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

కంటోన్మెంట్​లో నిర్వహించిన రోడ్​షోలో కేటీఆర్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details