ప్రజలనాడి తెలుసుకునేందుకు సామాజిక మాద్యమమే సాధనమని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రత్యర్థుల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు. తెలంగాణ భవన్లో సోషల్ మీడియా కార్యకర్తలతో సమావేశమయ్యారు.
'పతంగులపై కారు గుర్తు పెట్టి ప్రచారం చేయండి' - telangana municipal elections
సాంకేతికతతో వినూత్నంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేయాలని కేటీఆర్ సూచించారు. ప్రతి గడపకు తెరాస సందేశం వెళ్లేలా చూడాలని పేర్కొన్నారు. సంక్రాంతి సందర్భంగా పతంగులపై కారు గుర్తు పెట్టి ప్రచారం చేయాలని అన్నారు.
ktr
మున్సిపల్ ఎన్నికల్లో సామాజిక మాధ్యమాలను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. తెరాస ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. సాంకేతికతతో వినూత్నంగా ప్రచారం చేయాలని సూచించారు.
ఇదీ చూడండి: వాళ్లకు అభ్యర్థులు లేరు.. అంశాలు లేవు: పల్లా