ఎక్కడి ఏ ఎన్నిక వచ్చినా ప్రజలు కేసీఆర్ నాయకత్వానికే జై కొడుతున్నారని తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. భాజపా నాయకులు ప్రజల్లో భ్రమలు కల్పిస్తున్నారని మండి పడ్డారు. భాజపా నేత రావుల శ్రీధర్‌రెడ్డిని కండువా కప్పి తెరాసలోకి కేటీఆర్ ఆహ్వానించారు. భాజపాకు అన్ని వర్గాలు దూరమవుతున్నాయన్న కేటీఆర్... మతం పేరుతో చిచ్చుపెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఎన్నిక ఏదైనా కేసీఆర్ నాయకత్వానికే జై కొడుతున్నారు: కేటీఆర్ - రావుల శ్రీధర్ రెడ్డిని తెరాసలోకి ఆహ్వానించిన కేటీఆర్
ఎన్నిక ఏదైనా ప్రజలు కేసీఆర్ నాయకత్వానికే జై కొడుతున్నారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్యానించారు. మతం పేరుతో చిచ్చు పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.
ఎన్నిక ఏదైనా కేసీఆర్ నాయకత్వానికే జై కొడుతున్నారు: కేటీఆర్
రాష్ట్రం నుంచి తీసుకోవడమే తప్ప దిల్లీ నుంచి ఏమీ ఇవ్వడం లేదని కేటీఆర్ విమర్శించారు. ఆరేళ్లలో పన్నుల రూపంలో కేంద్రానికి రూ.2.72 లక్షల కోట్లు చెల్లించామని వివరించారు. కేంద్రం నుంచి తెలంగాణ రూ.1.43 లక్షల కోట్లే ఇచ్చారని స్పష్టం చేశారు. నోట్ల రద్దు.. రైతులు వద్దు.. కార్పొరేట్లు ముద్దు అనే విధంగా కేంద్రం వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు.
ఇదీ చూడండిఃశంషాబాద్లో ధరణి సేవలు పరిశీలించిన సీఎస్ సోమేష్ కుమార్