తెరాస కార్పొరేటర్ అభ్యర్థులు అనుసరించాల్సిన ప్రచార వ్యూహాన్ని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు దిశానిర్దేశం చేశారు. జీహెచ్ఎంసీ పోటీ చేస్తున్న తెరాస అభ్యర్థులకు నిన్న తెలంగాణ భవన్ లో బీ ఫారాలు పంపిణీ చేసిన కేటీఆర్.. ఈ పది రోజులు అనుసరించాల్సిన తీరును వివరించారు. ఆరేళ్లలో సాధించిన అభివృద్ధే ప్రధాన ప్రచార అస్త్రంగా ప్రజల్లోకి వెళ్లాలని కేటీ రామారావు చెప్పారు. టికెట్ దక్కిందన్న గర్వం, అహంకారం ఉండకూడదని.. టికెట్ ఆశించిన మిగతా నేతల వద్దకు వెళ్లి సహకరించాలని కోరాలని.. పార్టీలో అందరినీ కలుపుకొని పోవాలని చెప్పారు. రానున్న పది రోజులు 24 గంటలూ పనిచేయాలని స్పష్టం చేశారు. ఇంటింటికీ తిరిగి.. ప్రతీ గడప తొక్కి.. హైదరాబాద్ లో జరిగిన ప్రగతిని ప్రజలకు వివరించి ఆశీర్వాదం కోరాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇవాళ ఉదయమే బీఫారాలు సమర్పించి.. మధ్యాహ్నం నుంచి పూర్తి స్థాయి ప్రచారంలో నిమగ్నం కావాలని వివరించారు.
హైదరాబాద్ ఇంజిన్..
తెరాస విడుదల చేసిన హైదరాబాద్ ప్రగతి నివేదికను అభ్యర్థులందరూ అధ్యయనం చేయాలని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రజలకు తమ డివిజన్ తో పాటు.. హైదరాబాద్ లో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరించాలన్నారు. ప్రభుత్వం చేసిన పనులు చెబుతూ.. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ కు ఏం చేసిందో ప్రశ్నిస్తూ ప్రజల్లో చర్చ తీసుకు రావాలన్నారు. కరోనా కష్టాలు, వరద నష్టాల్లో ప్రజలకు అండగా ఉన్నది తెరాస నాయకులు, కార్యకర్తలేనని.. ప్రతిపక్షాలు ఎక్కడున్నాయని ప్రచారం చేయాలని దిశా నిర్దేశం చేశారు. అభివృద్ధి కావాలా.. అశాంతి కావాలో ఆలోచించాలని ప్రజలను కోరాలన్నారు. ఎలాంటి హైదరాబాద్ కావాలో నగరమంతటా చర్చనీయాంశంగా చేయాలని పార్టీ అభ్యర్థులకు కేటీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం మొత్తానికి హైదరాబాద్ ఆర్థిక ఇంజిన్ లాంటిదని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రానికే కీలకమైన ఎన్నిక కాబట్టి ఏ మాత్రం అలక్ష్యం చేయవద్దని.. ప్రజల ఆశీర్వాదం కోరారు.
దమ్ముందా..?