తెలంగాణ రాష్ట్ర సమితి (trs party) జిల్లా కమిటీల నియామకం, ప్లీనరీపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(KTR) వెల్లడించారు. పార్టీ జిల్లా శాఖ అధ్యక్షులను త్వరలో... గులాబీ బాస్, సీఎం కేసీఆర్(CM KCR) త్వరలో ప్రకటిస్తారని పార్టీ నేతలకు కేటీఆర్ తెలిపారు.
సంస్థాగత కమిటీల నిర్మాణంపై పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఎమ్మెల్యేలతో కేటీఆర్(KTR) బుధవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామ, మండల కమిటీలు పూర్తయ్యాయని ఎమ్మెల్యేలు.. కేటీఆర్(KTR)కు వివరించారు. ఇంకా ఎక్కడైనా నియమకాలు జరగాల్సి ఉంటే రేపటిలోగా పూర్తి చేయాలని కేటీఆర్.. పార్టీ నేతలకు సూచించారు. ఈనెల 24 నుంచి ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారు కాబట్టి... ఎల్లుండిలోగా కమిటీల వివరాలన్నీ రాష్ట్ర కార్యాలయానికి పంపించాలని కేటీఆర్ పేర్కొన్నారు.
అక్టోబరులో తెరాస ప్లీనరీ..
తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ, పార్టీ ద్విదశాబ్ది బహిరంగ సభను అక్టోబరులో నిర్వహించనున్నారు. అదే నెలలో రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటై సంస్థాగత ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. పార్టీ మండల కమిటీలను పూర్తి చేసి, ఆ తర్వాత జిల్లా కమిటీలపై దృష్టి సారిస్తారు. జిల్లా కమిటీలో ఒక ఉపాధ్యక్ష, మరో కార్యనిర్వాహక కార్యదర్శి పదవి మహిళలకు కేటాయిస్తారు. ఇందుకోసం పార్టీ నియమావళిలో మార్పులు చేశామని కేటీఆర్ ఇటీవలే ప్రకటించారు.