TRS Ministers Protest at Begumpet : కేంద్రం పెట్టుబడుల ఉపసంహరణ చేపట్టిందని.. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారని రాష్ట్ర మంత్రి తలసాని అన్నారు. సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేయాలని యత్నిస్తున్నారని మండిపడ్డారు. రైతుల పంటలను కొనుగోలు చేయబోమంటోందని తెలిపారు. రైతుల సమస్యలపై మాట్లాడేందుకు కనీసం అపాయింట్‌మెంట్ ఇవ్వట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
TRS Protest over Fuel Prices Hike : పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నిరసిస్తూ.. తెరాస ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. హైదరాబాద్ బేగంపేట్‌లోని చీఫ్ రేషనింగ్ ఆఫీస్ ఎదుట రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. పెంచిన చమురు ధరలు వాహనదారులకు భారంగా మారాయని.. తక్షణమే రేట్లు తగ్గించాలని డిమాండ్ చేశారు.
TRS Dharna in Hyderabad : "కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారు గద్దె దించే వరకు విశ్రమించం. కేంద్రానికి ప్రజా సమస్యలు పట్టడం లేదు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తోంది. ఇప్పటికే కొవిడ్ నేపథ్యంలో కుదేలైన ఆర్థిక రంగం, పారిశ్రామిక రంగాలు.. వ్యాపారాలు దెబ్బతిన్నాయి. మునుపెన్నడూ లేని విధంగా నిరుద్యోగం పెరిగిపోయింది. స్వరాష్ట్ర సాధన తర్వాత కేవలం ఎనిమిదేళ్లలో కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. 24 గంటల విద్యుత్, సురక్షిత తాగు నీరు, కల్యాణ లక్ష్మి వంటి 150 కార్యక్రమాలు అమలు చేస్తున్నాం."