TRS Protest in Delhi: రాష్ట్రంలో యాసంగిలో పండిన వడ్లను కేంద్రప్రభుత్వమే కొనుగోలు చేయాలంటూ దిల్లీలో పోరాటానికి అధికార తెరాస సిద్ధమవుతోంది. ఈనెల 11న దిల్లీలో తెలంగాణభవన్ వేదికగా తెరాస ధర్నా చేపట్టనుంది. ఆ ధర్నా కోసం పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. ఎండ వేడిని తట్టుకునేలా... టెంట్లు ఏర్పాటు చేస్తున్న శ్రేణులు.. ధర్నాకు వచ్చే వారి కోసం ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతున్నారు.
TRS Protest in Delhi: ధాన్యం కొనుగోళ్లపై దిల్లీలో తెరాస పోరాటం.. - ధాన్యం కొనుగోళ్లపై తెరాస ఆందోళనలు
TRS Protest in Delhi: ధాన్యం కొనుగోళ్ల అంశంపై కేంద్రంపై యుద్ధం ప్రకటించిన తెరాస.. గత మూడ్రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేస్తోంది. ఇప్పుడు దిల్లీలో పోరాటానికి సిద్ధమవుతోంది. ఈనెల 11న హస్తినలోని తెలంగాణ భవన్ వేదికగా ధర్నాకు తెరాస రంగం సిద్ధం చేస్తోంది. దీని కోసం పార్టీ శ్రేణులు ఏర్పాట్లు మొదలుపెట్టారు. దేశ రైతాంగానికి మద్దతుగా గొంతెత్తే నేతలంటూ కేసీఆర్, కేటీఆర్ ఫ్లెక్సీలు దేశ రాజధాని రహదారులపై కనిపిస్తున్నాయి.
TRS Protest in Delhi
TRS Protest Against Modi: దిల్లీలో జరిగే నిరసనల్లో ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, ఎంపీలు, మంత్రులు సహా పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. దేశ రైతులకు మద్దతుగా గొంతెత్తే నేతలంటూ కేసీఆర్, కేటీఆర్‌ల ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. ధర్నాలో పాల్గొనాలని జాతీయ రైతు సంఘాలు, వ్యవసాయ సంఘాల నేతలకు ఆహ్వానం పంపినట్లు సమాచారం.