TRS protest against central : పాలు, పాల అనుబంధ ఉత్పత్తుల పైన కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ పన్ను విధించటాన్ని వ్యతిరేకిస్తూ తెరాస నిరసనల బాట పట్టింది. జీఎస్టీకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టాలని ఇప్పటికే తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పాలు , పాల ఉత్పత్తులపైన కేంద్రం మొదటిసారి జీఎస్టీ విధించిందంటూ కేటీఆర్ ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు.
KTR calls for protest on GST : ఇదేందయ్యా ఇది.. పాలపై జీఎస్టీ ఏంది..? - KTR calls for protest against GST on milk
TRS protest against central : పాలు, పాల ఉత్పత్తులపై జీఎస్టీ విధించడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేయాలని పార్టీ శ్రేణులకు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాల్లో పాడి రైతులను భాగస్వాములుగా చేయాలని సూచించారు. దిల్లీలో గాంధీ విగ్రహం వద్ద తెరాస ఎంపీలు నిరసన చేపట్టారు.
KTR calls for protest on GST
KTR calls for protest on GST :రైతుల ఆదాయానికి అత్యంత కీలకమైన పాలు, పాల ఉత్పత్తులపై పన్ను విధించడం పట్ల జరిగే నష్టాన్ని వివరిస్తూ.. అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ముఖ్యంగా పాడి రైతులను ఇందులో భాగస్వాములను చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దిల్లీలో పార్లమెంట్ ఆవరణలో గాంధీ భవన్ వద్ద తెరాస ఎంపీలు నిరసనకు దిగారు.