జీహెచ్ఎంసీ తెరాస మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులు - జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక
08:16 February 11
జీహెచ్ఎంసీ తెరాస మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులు
జీహెచ్ఎంసీ తెరాస మేయర్ అభ్యర్థిగా పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి పేరు దాదాపు ఖరారైంది. బంజారాహిల్స్ కార్పొరేటర్‌గా గెలిచిన గద్వాల విజయలక్ష్మిని పార్టీ ఎంపిక చేసినట్టు సమాచారం. అటు డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా మోతె శ్రీలత పేరు దాదాపు ఖరారైంది. తార్నాక డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా గెలిచిన మోతె శ్రీలతను డిప్యూటీ మేయర్‌గా పార్టీ ఎంపిక చేసినట్టు సమాచారం.
మరోవైపు తెలంగాణ భవన్‌లో పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్‌తో తెరాస కార్పొరేటర్లు సమావేశమయ్యారు. వారికి కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు. మేయర్ ఎన్నికపై అనుసరించాల్సిన విధానాన్ని ఆయన వివరించారు. అక్కడ నుంచి తెరాస కార్పొరేటర్లు ప్రత్యేక బస్సులో జీహెచ్ఎంసీ కార్యాలయానికి వెళ్లనున్నారు.
ఇవీ చూడండి:గ్రేటర్ పీఠంపై ఉత్కంఠ: ఎవరి బలం ఎంత