TRS party resumes insurance for activists: తెరాస తమ కార్యకర్తలకు ప్రమాదవశాత్తు ఎవరైన వికాలాంగులైన వారికి గత ఆరు సంవత్సరాలుగా ప్రమాద బీమా చెల్లిస్తూ వస్తోంది. ఏటాలాగానే ఈ సంవత్సరం కూడా తమ కార్యకర్తలకు బీమా సదుపాయాన్ని మళ్లీ కొనసాగించింది. ఆరేళ్లుగా కార్యకర్తల కోసం ప్రమాద బీమా కల్పిస్తున్న అధికార పార్టీ ఈ సంవత్సరం కూడా యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రీమియాన్ని చెల్లించింది.
కార్యకర్తలకు బీమా సదుపాయాన్ని కొనసాగించిన తెరాస
TRS party resumes insurance for activists: కార్యకర్తలకు బీమా సదుపాయాన్ని తెరాస మళ్లీ కొనసాగించింది. ఆరేళ్లుగా కార్యకర్తల కోసం ప్రమాద బీమా కల్పిస్తున్న అధికార పార్టీ.. ఈ సంవత్సరం కూడా యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రీమియాన్ని చెల్లించింది. బీమా కంపెనీ ప్రతినిధులకు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రీమియం డబ్బుల చెక్కును అందజేశారు.
బీమా కంపెనీ ప్రతినిధులకు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రీమియం డబ్బుల చెక్కును అందజేశారు. ఏడేళ్లుగా సుమారు 66 కోట్ల రూపాయల ప్రీమియంను తెరాస బీమా కోసం చెల్లించింది. ఆరేళ్లలో ప్రమాదాల్లో మరణించిన నాలుగు వేల మంది కార్యకర్తలకు బీమా సొమ్ము అందించినట్లు తెరాస వెల్లడించింది. పార్టీ సభ్యత్వం ఉన్న 70ఏళ్లలోపు కార్యకర్తలకు అందరికీ ప్రమాద బీమా సదుపాయం వర్తిస్తుంది. దురదృష్టవశాత్తు మరణిస్తే 2 లక్షల రూపాయలు, పూర్తిగా వికలాంగులైతే లక్ష రూపాయలు, పాక్షికంగా వికలాంగులైతే 50 వేల రూపాయల బీమా అందిస్తున్నట్లు తెరాస వెల్లడించింది.
ఇవీ చదవండి: