తెలంగాణ

telangana

ETV Bharat / city

హస్తినలో ధర్నాకు సిద్ధమవుతున్న గులాబీ దళం.. ఏర్పాట్లు ముమ్మరం.. - ధాన్యం కొనుగోళ్లు

TRS Protest in Delhi: ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం వైఖరిపై తెరాస పోరాటం కొనసాగుతోంది. నాలుగో తారీఖు నుంచి ప్రారంభమైన తెరాస నిరసనల పరంపరం.. ఈ నెల 11న హస్తినకు చేరనుంది. దిల్లీలో తెలంగాణ భవన్​ వేదికగా.. పెద్దఎత్తున తెరాస ధర్నా చేపట్టనుంది. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

TRS Party leaders preparing for protest in Delhi and  Arrangements going on
TRS Party leaders preparing for protest in Delhi and Arrangements going on

By

Published : Apr 8, 2022, 5:26 PM IST

TRS Protest in Delhi: రాష్ట్రంలో యాసంగిలో పండిన వడ్లను కేంద్రప్రభుత్వమే కొనుగోలు చేయాలంటూ వివిద రూపాల్లో పోరాటం చేస్తున్న తెరాస.. దిల్లీలోనూ తన నిరసన తెలియజేసేందుకు సిద్ధమవుతోంది. ఈనెల 11న.. దిల్లీలో తెలంగాణభవన్ వేదికగా తెరాస ధర్నా చేపట్టనుంది. ఆ ధర్నా కోసం పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. ఎండ వేడిని తట్టుకునేలా టెంట్లు ఏర్పాటు చేస్తున్న శ్రేణులు.. ధర్నాకు వచ్చే వారి కోసం ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతున్నారు.

దిల్లీలో జరిగే నిరసనల్లో ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్​తో పాటు ఎంపీలు, మంత్రులు సహా పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. దేశ రైతులకు మద్దతుగా గొంతెత్తేనేతలంటూ కేటీఆర్​, కేటీఆర్​ అంటూ ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. ధర్నాకు సంబధించి తెలంగాణ భవన్‌ అధికారులతో ఎంపీలు సంతోష్‌, రంజిత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.

మూడు రోజుల నుంచి:నాలుగో తారీఖున మొదలైన తెరాస నిరసనల పరంపర.. మూడ్రోజులుగా కొనసాగుతోంది. కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ దళం ఆందోళనలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా.. ర్యాలీలు, నల్లజెండాలతో తెరాస నిరసన తెలుపుతోంది. ఈ నిరసనల్లో ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులకు జరుగుతున్న అన్యాయంపై కేంద్రంపై నిప్పులు చెరుగుతున్నారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details