రాష్ట్రంలో అమలవుతున్న ఇంటి ఇంటికి మంచి నీళ్ల పథకానికి కేంద్రం నిధులివ్వట్లేదని తెరాస లోక్‌సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు ఆరోపించారు. ఈ విషయమై పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రాన్ని నిలదీస్తామని అన్నారు. తెలంగాణ భవన్లో తెరాస కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈనెల 18 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.
విభజన హామీల అమలు... నిధుల సాధనే ధ్యేయం... - ktr latest news
రాష్ట్రానికి రావల్సిన నిధులు, పెండింగ్ అంశాలపై తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చించినట్లు ఆ పార్టీ లోక్‌సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు తెలిపారు. అన్ని పెండింగ్ అంశాలపై పార్లమెంట్ సమావేశాల్లో చర్చిస్తామన్నారు. రాష్ట్రం అమలు చేస్తున్న పథకాలకు కేంద్రం నిధులు ఇవ్వాలని అన్నారు.
trs parliamentary party meeting
ఇదీ చూడండి: వార్షిక ఆదాయం 5 లక్షలు ఉన్నా ఆరోగ్యశ్రీ వర్తింపు
Last Updated : Nov 15, 2019, 6:54 PM IST