TRS MPs Walkout From Parliament : ధాన్యం సేకరణపై చర్చించాలని ఉభయసభల్లో పట్టుబట్టిన తెరాస ఎంపీలు.. ఆ చర్చలు జరపకపోవడంతో లోక్‌సభ, రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. అంతకుముందు.. తెలంగాణ ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ తెరాస ఎంపీలు లోక్‌సభలో ఆందోళనకు దిగారు. ఉప్పుడు బియ్యం కొనుగోళ్ల అంశంపై ఉభయ సభల్లో వాయిదా తీర్మానం ఇవ్వగా తరస్కరణకు గురయ్యాయి. రాజ్యసభలో వాయిదా తీర్మానంపై చర్చకు తెరాస ఎంపీ సురేశ్‌రెడ్డి పట్టుబట్టారు. చాలా ముఖ్యమైన అంశమని ప్రస్తావించారు. ఒడిశాతో పాటు మరికొన్ని రాష్ట్రాలు ఇబ్బందులు పడుతున్నాయని సభ దృష్టికి తెచ్చారు. పారా బాయిల్డ్ అంశంపై చర్చించాలని విజ్ఞప్తి చేసిన ఎంపీ సురేశ్‌రెడ్డి.. కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో... తమకు వాకౌట్ చేయడం మినహా.. మరో అవకాశం లేదన్నారు.
ఉభయసభల నుంచి తెరాస ఎంపీల వాకౌట్ - లోక్‌సభలో తెరాస ఎంపీల ఆందోళన
TRS MPs Walkout From Parliament : లోక్‌సభ, రాజ్యసభ నుంచి తెరాస ఎంపీలు మరోసారి వాకౌట్ చేశారు. ధాన్యం సేకరణపై చర్చించాలని పట్టుబట్టిన ఎంపీలు.. ఉభయ సభలు చర్చ జరపకపోవడంతో సభల నుంచి బయటకువెళ్లారు. ఉభయసభల్లోనూ వాయిదా తీర్మానం నోటీసులు ఇవ్వగా తిరస్కరణకు గురయ్యాయి.

TRS MPs Walkout From Parliament
TRS MPs Protest in Lok Sabha : రాష్ట్రంలో ధాన్యం సేకరణ అంశంపై లోక్‌సభలో తెరాస ఎంపీలు ఆందోళనతో హోరెత్తించారు. ఆహార ధాన్యాల సేకరణపై నిర్దిష్టమైన జాతీయ విధానం తేవాలని ప్లకార్డులు ప్రదర్శించారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం చేస్తోందని నిరసన వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఆవరణలోనూ తెరాస ఎంపీలు నిరసన తెలిపారు. కేంద్రం తీరుకు నిరసనగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో వెంటనే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం సభ నుంచి వాకౌట్ చేశారు.